హైదరాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి రోశయ్య నివాళి అర్పించారు. మహాత్ముని వర్థంతిని పురస్కరించుకొని బాపూ ఘాట్ వద్ద సీఎం శనివారం శ్రద్ధాంజలి ఘటించారు. రోశయ్యతో పాటుగా పీసీసీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ పలువురు మంత్రులు కూడా జాతిపితకు నివాళి అర్పించారు. జాతికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.