హైదరాబాద్ : పడవ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటంబాలను ఆదుకోవాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. ప్రభుత్వం తక్షణం సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. పడవ ప్రమాదం పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెదేపా నాయకులతో కూడా ఆయన మాట్లాడి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు కూడా ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.