మాగ్నాలో ఆగ్నిప్రమాదం హైదరాబాద్ : హబ్సీగూడలోని మాగ్నా సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ భవనంలోని సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్ మంటల్లో చిక్కుకుంది. భారీగా పొగ రావటంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని ప్రాధమిక సమాచారం.
News Posted: 31 January, 2010
|