హైదరాబాద్ : అబిడ్స్ల్ లోని తురు బజారులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ షాపు దగ్థమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో మంటలను ఆర్పివేడంతో ఈ ప్రమాదం తప్పింది. దుకాణం పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.