బాధితులకు పరిహారం హైదరాబాద్ : నక్సల్స్ హింస వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, అయిదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ కుటుంబాల్లో ఉద్యోగం పొందే అర్హత ఉన్న వారు లేకపోతే అదనంగా మరో ఐదు లక్షల రూపాయలను ఇస్తామని తెలిపారు.
నక్సల్స్ ప్రాంతాల అభివృద్థిపై మంగళవారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. మంత్రి దర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి శ్రీధరబాబు, డీజీపీ గిరీష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం హోమంత్రి సబితా మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలోని బలిమెల ఘటనలో మృతి చెందిన 9 పోలీసు కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆమె తెలిపారు.
News Posted: 2 February, 2010
|