హైదరాబాద్ : ఎయిడ్స్ రోగులకు కూడా పెన్షన్ ఇవ్వనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి నెలకు 200 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పారు. సర్వే పూర్తి అయ్యే వరకు ఎవరి పెన్షన్ రద్దు చేయరని మంత్రి హామీ ఇచ్చారు.