'సంఘటిత పోరాటం' హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తున్నారని చాటి చెప్పేందుకు మానవహారం నిర్వహిస్తున్నామని తెలంగాణ జేఏసీ కన్వీనరు కోదండరామ్ వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా నుండి కోదాడ వరుకు రాజకీయ పార్టీలు నేతల, కార్యకర్తలు, ప్రజాసంఘాలతో మానవ హారాన్ని నిర్మించారు. కోదండరామ్ దీన్న ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తున్నారని చాటి చెప్పేందుకు మానవహారాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు నాగం జనార్థన రెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, కేటీ రామారావు, బద్ద బాల్ రెడ్డి, లక్ష్మణ్ లు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.
News Posted: 5 February, 2010
|