హైదరాబాద్ : మల్లాపూర్ లో మూడు రోజుల క్రితం క్రితం జరిగిన చోరీ కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం పోలీస్టేషన్ పరిధిలో సోమవారం సినీ ఫక్కీలో ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన కారు డ్రైవర్ షరీఫ్ 42 లక్షల రూపాయలతో ఉడాయించిన సంగతి తెలిసిందే. సంఘటనా స్థలంలో లభించిన ఆదారాల మేరకు పోలీసులు దర్యాప్తు సాగించగా కారుడ్రైవర్ షరీఫ్ కరీంనగర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.