వర్శిటీలపై కమిటీలు హైదారాబాద్ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పనితీరు, అభివృద్ధిపై మదింపు చేసేందుకు మూడు కమిటీలు నియమించాలని ఉప కులపతులు సమావేశం నిర్ణయించింది. జూబ్లీ హిల్స్ లో సోమవారం విశ్వవిద్యాలయాల ఉప కులపతుల సమావేశం జరిగింది. గవర్నర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల వార్షిక ప్రణాళిక దెబ్బ తింటే సహించేది లేదని, అదే జరిగితే అందుకు వైస్ ఛాన్సలర్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సిన ఉప కులపతులపై ఉందని హితవు పలికారు. ఒకవేళ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేసారు.
News Posted: 8 February, 2010
|