ఘంటసాల ఆరాధనోత్సవాలు
హైదారాబాద్ : ప్రముఖ గాయకుడు ఘంటసాలను స్మరించుకుంటూ 51 రోజులపాటు ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు వంశీరామరాజు తెలిపారు. ఫిబ్రవరి 11న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఏప్రిల్ రెండు వరకు జరుగుతాయని ఆయన చెప్పారు. త్యాగరాయ గానసభలో జరగనున్న ఈ కార్యక్రమంలో గాయనీ, గాయకులు ప్రతీ రోజూ 51 పాటలను ఆలపిస్తారని తెలిపారు. ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి దీనికి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. భవిష్యత్తు తరాల కోసం ఘంటసాల మ్యూజియం నిర్మించే యోచన కూడా ఉందని వంశీ రామరాజు తెలిపారు.
News Posted: 9 February, 2010
|