హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న1100 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఆయన సూచించారు. సచివాలయంలో మంగళవారం సిఎం విద్యాశాఖపై సమీక్ష జరిపారు. అనంతరం సీఎం రోశయ్య 1154 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లను అనుమతి మంజూరు చేయాలని సీఎం ఆర్ధిక శాఖను ఆదేశించారు మరో 2 వేల జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని కూడా ఆయన ఆదేశించారు.