హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్యపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేసారు. పంజాగుట్ట ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు నాని శవయాత్ర చేసారు. రౌడీ రాజకీయాలు చేసే నానికి సిఎంపై విమర్శలు చేసే స్థాయి లేదని పిసిసి ప్రచార కార్యదర్శి పాతపాటి అంజిబాబు మండిపడ్డారు.