సత్యం ఆడిటర్ కు బెయిల్ హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ ఆడిటర్స్ లో ఒకరైన ప్రైస్ వాటర్ కంపెనీ ఆడిటర్ విడుదలయ్యారు. గత శనివారం ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ మరో కేసు నమోదు చేయడంతో ఆయన విడుదల వాయిదా పడింది. కోర్టు, బెయిల్ ఉత్తర్వులపై ఇవాళ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైలు నుండి ఆయన విడుదలయ్యారు. ఇద్దరు న్యాయవాదులు వెంటరాగా తాళ్లూరి శ్రీనివాస్ జైలు నుండి బయటకు వచ్చారు.
News Posted: 10 February, 2010
|