క్రికెట్ అభిమానుల నిరసన హైదరాబాద్ : హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేసారు. మ్యాచ్ లు రాష్ట్రంలో జరగకుండా కేంద్ర మంత్రి శరద్ పవార్ అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ, క్రికెట్ క్రీడాభిమానులు బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద ఆయన దిష్టి బొమ్మను దగ్థం చేసారు. రాష్ట్రంలో మ్యాచ్ లు నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, తెంలగాణ జేఏసీ కూడా మద్దతు తెలిపినప్పిటికీ మ్యాచ్ ని హైదరాబాద్ లో నిర్వహించకపోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
News Posted: 11 February, 2010
|