'వాలంటైన్ డేని బహిష్కరించాలి' హైదరాబాద్ : వాలంటైన్ డే రోజున బయట కనిపించిన జంటలకు పెళ్లిళ్లు చేస్తామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. నిజమైన ప్రేమికులు బయటకు రావొద్దని కోరింది. ప్రేమికుల రోజున తమ పిల్లలు పార్కులు వెంట తిరగకుండా చూసుకోవాలని తల్లితండ్రులను కోరింది. హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్న వాలంటైన్స్ డే ను బహిష్కరిస్తున్నట్లు బజరంగ్ దళ్ కన్వీనర్ హేమంత్ సింగ్ తెలిపారు. మిగతా రోజుల్లోనూ పబ్బులు, పార్కుల్లోను జరిగే అసభ్య కార్యకలాపాలను అడ్డుకుంటామని, ఇందుకోసం 500 మందితో టాస్కఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు బజరంగ్ దళ్ వెల్లడించింది.
News Posted: 11 February, 2010
|