హైదరాబాద్ : యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజే ఈ క్షేత్ర ఉత్సవాలకు సంప్రదాయబద్దంగా శ్రీకారం చుడతారు. తొలి రోజు ఉదయం స్వస్తివాచనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. రాత్రికి అంకురార్పణ సేవలుంటాయి. మరోవైపు ఉద్సవాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టను చేరుకుంటున్నారు. పదకొండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.