నల్గొండ : జిల్లాలోని నకిరేకల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఆటో -లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.