హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. ఈ అరెస్ట్ లను అడ్డుకునేందుకు విద్యార్థులంతా తరలిరావడంతో మల్లీ ఓయూలో ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓయూ జేఏసీ నేత రాజారాం ను పోలీసులు క్యాంపస్ లో అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో రమేష్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. పోలీసులు భవనం పై నుండి తోసేసారంటూ విద్యార్థులు పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేసారు.