హైదరాబాద్ : టీఆర్ ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. 2001 నుండి తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా కేసీఆర్ బలవంతంగా రాజీనామాలు చేయించి తెలంగాణ కోసం అసెంబ్లీని వేదికగా చేసుకోకుండా చేసారని తలసాని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై మౌనంగా ఉన్న సీమాంధ్ర నేతలను కేసీఆర్ తన వ్యాఖ్యలతో రెచ్చగొట్టారని ఆరోపించారు.