ఓయూలో సీఐడీ విచారణ హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభించింది. విశ్వవిద్యాలయానికి వచ్చిన అధికారులు విద్యార్థులను, మీడియా ప్రతినిధులను బుధవారం విచారించారు. లాఠీచార్జి చేసిన రోజున ఏం జరిగిందన్న అంశంపై ఆరా తీసారు. లాఠీచార్జి చేసిన వారిని గుర్తించగలరా, పత్రికల్లో వచ్చిన ఫోటోల ఆధారంగా గుర్తించగలరా అని సీఐడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దాడిలో ధ్వసంమైన వాహనాలతో పాటుగా మీడియాకు చెందిన కెమెరాల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
News Posted: 17 February, 2010
|