హైదరాబాద్ : అసెంబ్లీ దిగ్భంధనానికి ఉస్మానియా విద్యార్థులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల ప్రాంతంలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సగర పోలీసు కమీషనరు ఏకే ఖాన్ తెలిపారు. ఈ నెల 20 తేదీన విద్యార్థులు అసెంబ్లీ దిగ్భంధనానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.