లోక్ సత్తా సదస్సు
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా సత్తా పార్టీ సదస్సు నిర్వహించింది. పార్టీ కార్యాలయంలో గురువారం 'పెరుగుతున్న నేరాలు-మద్యం ప్రవాహం' అనే అంశం సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మహిళా సత్తా అధ్యక్షరాలు ఎన్ సరోజాదేవి, ప్రధాన కార్యదర్శి కె గీతామూర్తి పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు చట్టాలను సవరించాలని వక్తలు డిమాండ్ చేసారు.
News Posted: 18 February, 2010
|