హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం విద్యార్థులు నిర్వహించే శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే శంకర్రావు కోరారు. ర్యాలీకి ఆటంకం కిలిగిస్తారన్న అనుమానం ఉన్న విద్యార్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని సూచించారు. అసాంఘిక శక్తులు ర్యాలీకి చొరబడి విధ్వంసం సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.