హైదరాబాద్ : మావోయిస్టు మాజీ అగ్రనేత సాంబశివుడు శుక్రవారం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన సాంబశివుడు గత ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై గతంలో ఏడు హత్య కేసులున్నాయి. ఈ కేసుల్లో సాంబశివుడుకి బెయిల్ లభించడంతో ఆయన విడుదలయ్యారు.