హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులు రెచ్చిపోయి ఆస్తులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోలన చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ముఖద్వారం వద్ద యాదయ్య అనే యువకుడు ఒంటిపై కిరోసినే పోసుకుని నిప్పంటించుకోవడంతో విద్యార్థులు ఉద్రేకానికిలోనయ్యారు. ట్రాఫిక్ లో జామ్ అయి ఉస్మానియా వద్ద ఉన్న మూడూ ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు. సికింద్రాబాద్ లో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.