హైదరాబాద్ : నగరంలో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేసారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే శనివారం సాయంత్రానికి అసెంబ్లీ పరిసర ప్రాంతాల మినహా నగరంలోని మిగిలిన అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేసినట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ అరవిందరావు తెలిపారు.