హైదరాబాద్ : ఉద్రేకాలకు లోనై ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కోరారు. దయచేసి ఎవరూ ప్రాణత్యాగం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఉస్మానియాలో యాదయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. అఘాయిత్యాలను చేసుకునే ముందు తల్లితండ్రలు పరిస్థితిని కూడా ఒకసారి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.