ఎంసెట్ దరఖాస్తుల విక్రయం హైదరాబాద్ : ఎంసెట్, ఈ సెట్ ప్రవేశ పరీక్షల కోసం దరఖాస్తు ఫారాలను విక్రయాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసులు, ఆంధ్రాబ్యాంకు బ్రాంచీలు, ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు లభ్యమవుతాయి. ఈ రెండు ప్రవేశపరీక్షలను హైదరాబాద్ లోని జేఎన్ టీయూ నిర్వహించనుంది. ఒక్కో దరఖాస్తుకు 200 రూపాయలను వెలగా నిర్ణయించారు.
News Posted: 21 February, 2010
|