'కార్డుల ఏరివేత పారదర్శకం' హైదరాబాద్ : బోగస్ కార్డుల ఏరివేతలో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్ఫష్టం చేసారు. జూబ్లీ హాల్లో జరిగిన సోమవారం జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హతలేని వారి కార్డులను రద్దు చేయాలని, అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల తీరుపైనే ప్రభుత్వ ప్రతిష్ట ఆధారపడి ఉందని ఆయన అన్నారు.
News Posted: 22 February, 2010
|