హైదరాబాద్ : ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి హెచ్చరించారు. యూరియా ధరలు పెరిగిన నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కు ఎరువులు తరలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రానున్న ఖరీఫ్ లో విత్తన రాయితీకి 200 రూపాయల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రానికి 36 లక్షల టన్నుల ఎరువులను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.