హైదరాబాద్ : విజయవాడ కనకదుర్గ ఆలయ ఈఓ విజయ్ కుమార్ పదోన్నతిని రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ రద్దు చేసింది. గతంలో మూడు సార్లు పొందిన పదోన్నతలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు వెలువరించింది. అలాగే మరో అధికారి వర్మకు కూడా ఈ తీర్పు వర్తిస్తుంది ట్రిబ్యునల్ పేర్కొంది. 1975 సంవత్సరం నుండి ప్రభుత్వం ఇచ్చిన దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్ పదోన్నతలు చెల్లవని ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొంది. ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన 30 మంది అధికారుల పెన్షన్ లో కోత విధించాలని ఆదేశించింది.