మాదకద్రవ్యాల రాకెట్ లో నిర్మాత హైదరాబాద్ : డ్రగ్స్ స్కామ్ లో సినీ నిర్మాత కేవీ రావు పోలీసులకు పట్టుబడ్డారు. ఇన్నోవా కారులో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుండగా ఆయన పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసారు. అయన నుండి ఇన్నోవా కారును, 25 కిలోల మాదక ద్రవ్యాలు, ఐదు లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే స్కామ్ లో మరో ఇద్దరు నిర్మాతలున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కే వీ రావు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఆలాగే బాల నటుడు స్థాయి నుండి హీరోగా ఎదిగిన ఓ ప్రముఖ హీరో సోదరుడు కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
News Posted: 22 February, 2010
|