హైదరాబాద్ : ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అసమగ్ర విధానాన్ని అమలు చేస్తోందని లోక్ సత్తా పార్టీ అధినేత జయ్ ప్రకాష్ నారాయణ అసంతృప్తి వ్యక్తం చేసారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూరియా ధరను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎరువుల సంక్షోభాన్ని సృష్టించేదిలా ఉందని విమర్సించారు. కేంద్రం విధానం వల్ల రైతాంగానికి ఎటువంటి మేలు జరగదని ఆయన పెదవి విరిచారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులు ఆదుకోవాలంటే యూరియా ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు.