హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 28 మంది విద్యార్థినులు వాంతులతో నల్లకుంట పీవర్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకుని పరామర్శించేందుకు వచ్చిన వీసీని విద్యార్థినులు నిలదీసారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.