హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయమై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి సంఘాల జేఏసీ చర్చిస్తోంది. జేఏసీ నేతలు మంగళవారం ఆర్ట్స్ కళాశాలలో సమావేశమయ్యారు. వాయిదా పడుతున్న పరీక్షలపై కూడా వీరు చర్చిస్తున్నారు. శాంతియుతంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.