'జానాను నిలదీయండి' హైదరాబాద్ : తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలతో తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొ కోదండరామ్ మంగళవారం భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ జేఏసీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. జేఏసీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇప్పుడు జేఏసీ నుండి బయటకు వెళ్లడంపై నిలదీయాలని బేటీలో నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, తాము తెలంగాణ జేఏసీ లోనే ఉన్నామని, ఉద్యమంలో కొనసాగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ వైఖరిపై నిలదీయాలని కన్వీనరు కోదండరామ్ కు సూచించామని ఆయన వెల్లడించారు.
News Posted: 23 February, 2010
|