హైదరాబాద్ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి వెంకటస్వామి ఇంటిని తెలంగాణ వాదులు బుధవారం ముట్టిడించారు. సోమాజిగూడలోని ఆయన ఇంటిని చుట్టిముట్టి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వానికి వెంకటస్వామి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేసారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసారు. తెలంగాణకు అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెంకటస్వామి బయటకు రావాలని డిమాండ్ చేసారు.