కోదండకు కొమటిరెడ్డి హితవు హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తన స్థాయిని దిగజారి వ్యవహరిస్తున్నారని ఐటీ, క్రీడల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. విద్యార్థులపై తానే లాఠీచార్జి చేయించానని ఆరోపణలు చేస్తూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కోదండరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. తెలంగాణ రాకపోతే తమ పదవులు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజల ఎదుట తమని దోషిలుగా నిలబెట్టేందుకు కోదండరామ్ యత్నిస్తున్నారని ఆరోపించారు.
News Posted: 24 February, 2010
|