గుడ్డిలో మెల్ల బడ్జెట్: జేపీ హైదరాబాద్ : మమతా బెనర్జీ పార్లమెంట్ లో బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గుడ్డిలో మెల్ల విధంగా ఉందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. బడ్జెట్ లో పాత కాలపు ఆలోచనలే ఉన్నాయని, కొత్తతరం అవసరాలకు ప్రాధాన్యతలేదని ఆయన పెదవి విరిచారు. రైల్వే బడ్జెట్ పై బుదవారం జేపీ మీడియాతో మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రైల్వేలపై రాష్ట్రాలకు కూడా అధికారాలివ్వాలని అభిప్రాయపడ్డారు. రైల్వేలను దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా రూపుదిద్దాలని ఆయన సూచించారు.
News Posted: 24 February, 2010
|