'విమెన్స్ డే ఏర్పాట్లు' హైదరాబాద్ : మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షరాలు, మాజీ స్పీకర్ ప్రతిభాపాటిల్ వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళాదినోత్సవ ఏర్పాట్లలో భాగంగా వివిధ రంగాల్లో విశేష సవేలందించిన మహిళలకు సన్మానించనున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మహిళలకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసారు.
News Posted: 25 February, 2010
|