సీఎంకు దత్తాత్రేయ లేఖ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు భారతయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ లేఖ రాసారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో డిమాండ్ చేసారు. తిరుమలలో జరగాల్సిన పాలక మండలి సమావేశాన్ని నిబంధనలకు విరుద్దంగా కన్యాకుమారిలో ఎందుకు నిర్వహిస్తున్నారో తెలపాలని ఆయన లేఖలో కోరారు. అనంత స్వర్ణమయ పథకం వలన శ్రీవారి ఆలయంలో గోడలపై ఉన్న పవిత్ర శాసనాలు దెబ్బతింటాయని నిపుణులు ఆందోళన చెందుతున్నా, ఆ పథకాన్ని ఎందుకు కొనసాగించాల్సి వస్తుందో చెప్పాలని దత్తత్రేయ డిమాండ్ చేసారు.
News Posted: 25 February, 2010
|