ఇద్దరు విద్యార్థులు మృతి హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని కీసర వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన విద్యార్థులు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రమోద్, ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. బెక్ పై వెళుతున్న వీరిని నెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా, నిజామాబాద్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ సీఐ పద్మాకర్ రెడ్డి మృతి చెందగా, ఆయన భార్య జయశ్రీ గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారును వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
News Posted: 26 February, 2010
|