హోలీ ఆడొద్దు: దత్తన్న హైదరాబాద్ : తెంలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలతో అశాంతి నెలకొన్నందున తాను ఈ ఏడాది హోలీ పండుగ చేసుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో హోలీని ఎవరూ జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ ఏటా తాను హోలీని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటానని, తెలంగాణ సాధన కోసం ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ హోలీకి దూరం కావాలని నిర్ణయించికున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పేదలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ మార్చి 2 తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలోనూ జన జాగరణ పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
News Posted: 27 February, 2010
|