'హైకమాండ్ దే నిర్ణయం' హైదరాబాద్ : తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై అథిష్టాన నిర్ణయమే తమకు శిరోధార్యమని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ విషయంలో అథిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యను సోమవారం మంత్రి దానం కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై కాంగ్రెస్ స్ఫష్టమైన వైఖరితో ఉందన్నారు. కాంగ్రెస్ కు జేఏసీ కన్వీనరు కోదండ్ రామ్, టీఆర్ ఎస్ లు హైకమాండ్ లు కాదన్నారు.
News Posted: 1 March, 2010
|