హైదరాబాద్ : నగరంలోని షామీర్ పేటలోని రివ్యూజ్ రిసార్ట్స్ పై సోమవారం పోలీసులు దాడి చేసారు. హోలీ సంబరాలు హద్దులు మీరి అసభ్యకర నృత్యాలకు దారి తీయడంతో పోలీసులు దాడులు చేసారు. దాదాపుగా 35 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరి వివరాలను మాత్రం రహస్యంగా ఉంచారు.