యాక్సిడెంట్ లో ఐదుగురు మృతి హైదరాబాద్ : నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు - పెద్దకాపర్తి మధ్య ఎన్ హెచ్ -9పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చేటుచేసుకుంది. వాహన డ్రైవర్ మరో వాహనాన్ని ఓవరే టేక్ చేస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నార్కట్ పల్లిలోని కిమ్స్ ఆసుత్రికి తరలించారు. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News Posted: 2 March, 2010
|