హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను అడ్డుకునేందుకు విద్యార్థులు విఫలయత్నం చేసారు. రాజేంద్రనగర్ లోని ఆచార్య ఎన్జీరంగా యూనిరవర్శిటీలో వీసీల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు కోసం వ్యవసాయ విశ్వవిద్యలయాల వీసీల సదస్సుకు గవర్నర్ నరసింహన్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వీసీల సదస్సును అడ్డుకునేందుకు యత్నించారు. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.