హైదరాబాద్ సెంట్రల్ సీజ్

హైదరాబాద్ : పంజాగుట్ట చౌరస్తాలోని హైదరాబాద్ సెంట్రల్ షాపింగ్ మాల్ ను జిహెచ్ఎంసి అధికారులు మంగళవారం సీజ్ చేశారు. సెంట్రల్ యాజమాన్యం చాన్నాళ్ళుగా జిహెచ్ఎంసికి రెండు కోట్ల రూపాయల మేరకు బకాయి పడిన పన్నులు కట్టలేదని, అందుకే సీజ్ చేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ లో ఉన్న అన్ని థియేటర్లు, షాపింగ్ మాల్స్ కు కూడా అధికారులు తాళాలు వేశారు.
News Posted: 2 March, 2010
|