హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో వంద మంది న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ కు వస్తున్న శ్రీకృష్ణ కమిటీ గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కమిటీని తమ నిరసన తెలుపుతూ తెలంగాణ ప్రాంత న్యాయవాదులు పలువురు ఆందోళన చేపట్టారు. కమిటీని అడ్డుకునేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.