హైదరాబాద్ : నగరంలోని ఆంధ్రాబ్యాంకు రామకృష్ణాపురం బ్రాంచ్ లో 23.50 లక్షల రూపాయలు గల్లంతయ్యాయి. బ్యాంక్ ఆడిటింగ్లో ఈ మేరకు జరిగిన అవకతవకలు బయల్పడ్డాయి. దీంతో బ్యాక్ ఆడిట్ అధికారులు సరూర్ నగర్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు.